కోనసీమ: అమలాపురంలో ఒక కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్, అయినవిల్లి మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ, అంబాజీపేట మండల అధ్యక్షులు కురసా ఆంజనేయులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీ పటిష్టతకు విశేష కృషి చేయాలని సూచించారు.