నెల్లూరు ఎస్పీ డా. అజిత వెజెండ్ల ఆదేశాల మేరకు కావలి రూరల్ బీకే నగర్, ఒడిశా కాలనీల్లో పోలీసులు ఇవాళ ఉదయం కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతి ఇంటినీ పరిశీలించారు. సరైన పత్రాలు లేని 22 బైకులు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఒక పాత రౌడీషీటర్‌ను స్టేషన్‌కు పిలిపించి నేరాలకు దూరంగా ఉండాలని కౌన్సెలింగ్ ఇచ్చారు.