KNR: శంకరపట్నం మండలంలోని కేశవపట్నంలో రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. 29న పావనం జోగు తిరుగుట, 30న బోనాల కార్యక్రమం, 31న జాతర నిర్వహించనున్నారు. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.