ఆదిలాబాద్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు మార్గం సుగమమైంది. ఈ నెల 27న మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మొత్తం 4 పదవులకు 27 మంది పోటీ పడుతుండగా, అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం మున్సిపల్ కౌన్సిల్లో బీజేపీకి 23, కాంగ్రెస్కు 11, బీఆర్ఎస్, ఎంఐఎంలకు తలా 6, స్వతంత్రులకు 5 ఓట్లు ఉన్నాయి.