ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా దహెగాంలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగజ్ నగర్, సిర్పూర్ (టి)లో 46.3, తిర్యాణి 46.1, కౌటాల 45.9, ఆసిఫాబాద్లో 45.8 డిగ్రీలు నమోదయ్యాయి. తీవ్ర ఎండలతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.