TG: మొదటి విడత జనగణన మే 11 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సర్వే వచ్చే నెల 9 వరకు కొనసాగనుంది. ఇప్పటివరకు 65 లక్షల కుటుంబాల వివరాలను సేకరించారు. అయితే జనాభా లెక్కల సేకరణలో తప్పుడు సమాచారం నమోదు చేసే ఎన్యుమరేటర్లకు 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని కేంద్రం హెచ్చరించింది. కాగా ఎన్యుమరేటర్ల సమాచారాన్ని పరిశీలించడానికి ప్రతి ఆరుగురికి ఒక సూపర్వైజర్ను నియమించారు.