AP: లిక్కర్ స్కామ్ కేసులో తమకు ఎలాంటి నోటీసు రాలేదని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. రాజ్ కేసిరెడ్డితో పార్ట్నర్షిప్ ఉన్న కంపెనీకి నోటీసులిచ్చారని తెలిపారు. నోటీసు కంపెనీకి ఇచ్చారని, తన భార్య పేరుపై ఇవ్వలేదన్నారు. కంపెనీపై వచ్చిన ఆరోపణలకు 2021లోనే వివరణ ఇచ్చామన్నారు. 2021లో రాజ్ కేసిరెడ్డితో కలిపి SPV ఏర్పాటు చేశామని, 2022 తర్వాత దాన్ని నిలిపివేశామన్నారు.