తన జీవితంలో ఎదుర్కొన్న బాధాకరమైన సంఘటనను నిర్మాత బండ్ల గణేష్ తాజాగా పంచుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో షూటింగ్ స్పాట్లో సీనియర్ నటుడిని ‘సార్’ అని పిలిచినందుకు, ఆయన ఒక్కసారిగా చెప్పుతో కొట్టారని తెలిపాడు. ఆ అవమానమే తన జీవితాన్ని మార్చిందని.. ఆయన కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తానని అప్పుడే ఛాలెంజ్ చేశానని చెప్పాడు. ఆ కసితోనే నిర్మాతగా మారి విజయవంతమయ్యానని తెలిపాడు.