NTR: ఇబ్రహీంపట్నంలోని శ్రీ దశాంజనేయస్వామి ఆలయంలో మోహన్ రావు తన మధుర గాత్రంతో భక్తులను అలరిస్తున్నారు. నిత్యపూజలు,ఉత్సవాల్లో ఆయన పాడే హనుమాన్ చాలీసా,ఆంజనేయ దండకం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తుతోంది. ప్రతిఫలం ఆశించకుండా స్వామి సేవే లక్ష్యంగా ఆయన చేస్తున్న సంగీత సేవకు భక్తులు,ఆలయ కమిటీ అభినందనలు తెలుపుతున్నారు.