నెల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి సుమారు 55-60 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. వేదాయపాలెం – వెంకటాచలం స్టేషన్ల మధ్య 3వ లైన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. 5.2 అడుగుల ఎత్తు, బ్లూ లుంగీ ధరించాడు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు, ఆనవాళ్లు లభించలేదు. రైల్వే SI హరి చందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.