KNR: సైదాపూర్ మండలంలో మొక్కజొన్న కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ టెండర్ నిర్వాహకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సంచులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. వెంటనే కొనుగోళ్లు పూర్తి చేసి రైతులకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.