GDWL: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ రిపోర్టు తెలిపింది. ముఖ్యంగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. రైతులు ధాన్యం కల్లాలు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని అధికారులు సూచించారు.