NRML: కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ సమీపంలోని ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహిస్తున్న రైతు స్పృహ కోల్పోయి కిందపడిపోయాడు. దీంతో ఆ రైతును కడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైతులు ఇంత గోస పడుతున్నా కూడా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం స్పందించకపోవడం దారుణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.