SS: ధర్మవరం టౌన్ శివనగర్ 5వ వార్డు సచివాలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడి, పాత రికార్డులు, ముఖ్యమైన పత్రాలను కాల్చివేయడం ఆందోళన కలిగించింది. విషయం తెలిసి మంత్రి సత్యకుమార్ కార్యాలయ ఇన్ఛార్జ్ హరీష్ బాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కాలిపోయిన రికార్డులు, భద్రతా లోపాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.