NZB: 2027 గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించింది. నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి, రెంజల్ తదితర పుష్కరఘాట్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్యుత్, వసతి సదుపాయాలు కల్పించనున్నారు. పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.