AP: కులాల మధ్య చిచ్చుపెట్టడమే వైసీపీ నేతల పని అని TDP MLA ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. వైసీపీ హయాంలో బడుగువర్గాలపై దాడులు చేశారని, ప్రజావ్యతిరేక చర్యల వల్ల 11 సీట్లకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. ప్రజల తీర్పు చూసిన తర్వాత కూడా వైసీపీ నేతల్లో మార్పు రాలేదన్నారు. వివాదాలు సృష్టించి యువతను కేసుల్లో ఇరికిస్తున్నారని, మళ్లీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారన్నారు.