ప్రకాశం: దేశ వ్యాప్తంగా వాహనదారులకు పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరగడంతో షాక్ తగిలింది. పెరిగిన ధరలు సోమవారం ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. 10 రోజుల వ్యవధిలోనే నాలుగుసార్లు ఇంధన ధరలు పెరిగాయి. మార్కాపురం జిల్లా కేంద్రంలో ఇవాళ పెట్రోల్ రూ.117.68, డీజిల్ రూ. 105.33 ఉన్నాయి. పది రోజుల వ్యవధిలో పెట్రోలు లీటరుకు రూ. 7.34, డీజల్ లీటర్ రూ.7.45 పెరిగాయి.