WGL: పర్వతగిరి మండలం అన్నారం గ్రామచెరువులో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేసవికాలంలో నీటిమట్టం తగ్గిన పరిస్థితిని ఆసరాగా తీసుకుని ట్రాక్టర్లు, జేసీబీలతో మొరం తవ్వి యథేచ్ఛగా విక్రయిస్తున్నారని, అక్రమ మట్టి తవ్వకాలు పాల్పడుతున్న వారిపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.