KDP: సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన చెన్నూరుకి చెందిన జహీరుద్దీన్ అనే వ్యక్తికి కడప కోర్టు రిమాండ్ విధించింది. కడప నగరంలోని అల్మాస్పేటలో ఇటీవల ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో, జహీరుద్దీన్ ఒక వర్గం హక్కుల పరిరక్షణకు కలసి పోరాడాలని కోరుతూ ఆడియో సందేశాన్ని వైరల్ చేశాడు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి ఆదివారం అరెస్టు చేశారు.