KMM: అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధిత రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చే విధంగా తమ వంతు కృషి చేస్తామని ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వీరభద్రం అన్నారు. ఖమ్మం రూరల్ (మం) గోళ్ళపాడులో అగ్ని ప్రమాదంలో కాలిపోయిన పామాయిల్ తోటలను కాంగ్రెస్ నేతలతో కలిసి సోమవారం మండలాధ్యక్షులు పరిశీలించారు. సుమారు 10 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు.