కోనసీమ: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రేపు రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హతలు కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు పాల్గొని ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.