WNP: రబీ సీజన్ లో కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని నష్టపోకుండా ఉండేందుకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి నేరుగా బాయిల్డ్ రైస్ మిల్లులకు కేటాయిస్తున్నామని పౌరసరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాథ్ తెలిపారు. లారీల కొరత లేకుండా ఇప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దన్నారు.