ADB: ఆదిలాబాద్, తాంసీ వ్యవసాయ మార్కెట్లను మార్కెట్ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తనిఖీ చేశారు. మార్కెట్ యార్డుల్లో రైతులకు అందుతున్న మౌలిక వసతులు, ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆయన పరిశీలించారు. జొన్నల కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేసి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు మార్కెట్కు తీసుకువచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు.