KDP: సిద్దవటం మండలం వంతాటిపల్లె గ్రామంలోని లంకమల్ల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్యపూజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన హుండీలను ఈ నెల 25న ఉదయం 11 గంటలకు దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు హుండీ పరకామణి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ చైర్మన్ తెలిపారు.