WNP: కరీంనగర్లో ఇటీవల జరిగిన ఏబీవీపీ ప్రాంత అభ్యాస వర్గాల్లో వనపర్తి జిల్లా ఏబీవీపీ కన్వీనర్‌గా దేవర్ల కార్తీక్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని చెప్పారు. విద్యార్థుల సమస్యలను ఏబీవీపీ దృష్టికి తీసుకురావాలని సూచించారు.