TPT: తడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం నెం.3 వద్ద సుమారు 30 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. రైల్వే సిబ్బంది అతడిని 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.