హైదరాబాద్ మార్కెట్లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. గత వారం కిలో రూ. 250 నుంచి రూ. 270 వరకు పలికిన ధరలు, గత ఆరు రోజులుగా క్రమంగా తగ్గుతూ వచ్చాయి. సోమవారం నగరంలో విత్ స్కిన్ కిలో రూ. 209, స్కిన్ లెస్ రూ. 220గా నిర్ణయించారు. లైవ్ ఫాంరేటు రూ.106 పలుకుతోంది. ధరలు దిగిరావడంతో చికెన్ ప్రియులకు ఊరట లభించింది.