VZM: ద్విచక్ర వాహనం పైనుంచి జారిపడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన ఎస్.కోట మండలంలో జరిగింది. సీఐ వివరాల మేరకు ధర్మవరం గ్రామానికి చెందిన బంగారమ్మ(60) ఆదివారం కుమార్తె ఇంటికి తిమిడి వెళ్లడానికి పోతనాపల్లి వెళ్లింది. బస్సు కోసం ఎదురుచూస్తుండగా అదే గ్రామానికి చెందిన వ్యక్తి తిమిడి వెళ్తున్నాని చెప్పడంతో వాహనం ఎక్కారు. మార్గమధ్యలో వాహనం నుంచి జారిపడి మృతి చెందారు.