TG: వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించడానికి బీజేపీ బృందం బయలుదేరింది. ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు రైతు గోస- బీజేపీ భరోసా యాత్ర కొనసాగనుంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్లకు బీజేపీ నేతలు వెళ్తున్నారు. బస్సుయాత్రలో టీబీజేపీ రాంచందర్ రావు సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. సాయంత్రం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీని పరిశీలించనున్నారు.