SRCL: సిరిసిల్ల మండల కేంద్రంలోని సెస్ ఆఫీస్ వద్ద మెయిన్ రోడ్డుపై విద్యుత్ లూజ్ లైన్లను సరిచేయాలని ముస్తాఫనగర్ రైతులు ఆదివారం రాస్తారోకో చేపట్టారు. లూజ్ లైన్లతో ప్రమాదాలు, ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోయారు. త్వరగా సరిచేసి, ప్రమాదాలను నివారించాలని కోరారు. రాస్తారోకో వద్దకు పోలీసులు చేరుకుని రైతులను సముదాయించి విరమింపచేశారు.