NTR: జిల్లాలోని కోమటికుంటలో ప్రతిపాదిత MSME యూనిట్ ఏర్పాటుకు రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకుని నిరసన చేపట్టిన రైతులు, తమ సాగుభూములను పరిశ్రమ కోసం ఇవ్వబోమని స్పష్టం చేశారు. భూముల స్వాధీనం విషయంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు, ముందస్తు చర్చలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదన్నారు.