నెల్లూరు నవాబ్‌పేట పరిధిలోని భగత్‌సింగ్ కాలనీ టిడ్కో గృహాల్లో నివస్తున్న షేక్ బదుల్లా బీ (22) అనే వివాహిత భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వ్యక్తిగత సమస్యలతో మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. స్థానికులు ఫిర్యాదుతో నవాబ్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.