KKD: వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా యంత్రాలు, పరికరాలు కావాల్సిన రైతులు రేపటిలోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని పిఠాపురం అగ్రికల్చర్ ఏడీఏ స్వాతి ఆదివారం తెలిపారు. లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. రైతులు దరఖాస్తుల కోసం రైతు సేవా కేంద్రాల సిబ్బందిని లేదా ఆయా పరిధిలోని AOలను సంప్రదించాలని సూచించారు.