HYD: నగరంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ పథకం కింద నగరంలోనే నివాసాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. గతంలో శివారు ప్రాంతాల్లో కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో చాలామంది ఉపాధి ఇబ్బందులతో తిరిగి రావడంతో, ప్రస్తుతం పాత కాలనీల స్థలాల్లోనే పదంతస్తుల భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. స్లమ్ ఏరియాలనే బాగుచేయాలని ప్లాన్ చేస్తున్నారు.