నారాయణపేట జిల్లా కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలతో వరి ధాన్యం తడవకుండా కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో నారాయణపేట కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ వినీత్ పాల్గొన్నారు. వరి కొనుగోలు ప్రక్రియ పది రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.