రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. తండ్రీ కూతుళ్ల అనుబంధం, యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రవితేజ అయ్యప్ప భక్తుడిగా, ఓ కీలక సీన్లో వయసు పైబడిన గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం ‘విల్లాలి వీరుడు..’ అనే భక్తి పాటను రీమేక్ చేసినట్లు తెలిసింది. ఈ చిత్రం ఏడాది చివరిలో విడుదల కానుంది.