MNCL: కూలీల మేలు కోసమే ఈజీఎస్ పనులను ప్రారంభించామని జన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ సూచించారు. సోమవారం మండలంలోని ధర్మారం గ్రామ చెరువులో ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. చెరువులో నీరు నిల్వ ఉండే విధంగా ఈజీఎస్ పనులను ప్రారంభించామన్నారు. చెరువు మట్టి కావాల్సిన రైతులు తీసుకు వెళ్ళవచ్చన్నారు.