PDPL: ధాన్యం కొనుగోలు తుది దశకు చేరిందని ప్రభుత్వ విప్ విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, మరో వారం రోజుల్లో లక్ష ధాన్యం కొనుగోలు చేస్తాం, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. వర్షాల వల్ల తడిసి మొలకెత్తిన ధాన్యంను కొనుగోలు చేస్తామన్నారు.