MHBD: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సోమవారం ఉదయం శ్రీశైలం చేరుకున్న మాజీమంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా సత్యవతి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు.