SRCL: సారంపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ ప్రధాన రహదారిపై సోమవారం బైఠాయించి ధర్నాకు దిగారు. రైతుల నిరసనతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు అధికారులు వెంటనే స్పందించాలని రైతులు కోరుతున్నారు.