AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనకు జీవితాన్ని ఇచ్చే నదులను చంపవద్దని పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా నదులను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. వచ్చే 6 నెలల్లో నదుల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని అధికారులకు సూచించారు. జీవనదుల కోసం టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమస్యలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు.