ASR: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం మరోమారు పెరిగాయి. రాజవొమ్మంగిలో ఆదివారం లీటర్ పెట్రోల్ ధర రూ.119.96 ఉండగా, సోమవారం ఉదయం రూ.2.85 పెరిగి రూ.122.81కి చేరింది. అలాగే డీజిల్ ధర లీటరుకు రూ.105.35 నుంచి రూ. 2.79 పెరిగి రూ.108.14గా నమోదైంది. ఇంధన ధరలు వరుసగా పెరుగుతుండటంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.