MLG: మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు, నేతలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ములుగు జిల్లా ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలంతా పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం స్థానిక ప్రజలతో జిల్లా అధ్యక్షుడు మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు.