KMM: ఖమ్మం సమీపంలోని ధ్వంసలాపురం వద్ద 20 ఎకరాల్లో టీటీడీ సహకారంతో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నమూనాను అధికారులు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధాన ఆలయంతో పాటు వసతి గృహాలు, కళ్యాణ మండపం, పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే ఖమ్మం జిల్లాలో తిరుమల తరహా ఆధ్యాత్మిక వాతావరణంకి వేదిక కానున్నది.