నాగర్కర్నూల్ జిల్లాలో నేటి నుంచి 30 వరకు “మహిళా ఆర్థిక వారోత్సవం” నిర్వహించనున్నట్లు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. మహిళా సాధికారత, బాలికల భద్రత, జీవనోపాధి, అంగన్వాడీ సేవల బలోపేతం లక్ష్యంగా కార్యక్రమాలు జరగనున్నాయి. వంటల పోటీలు, గ్రామ సభలు, అవగాహన కార్యక్రమాలు, SHG లోన్ మేళాలు, మాక్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.