E.G: రాజమహేంద్రవరం పర్యటన సందర్భంగా జనసేన పార్టీ అధినేత,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని రాష్ట్ర టూరిజం డైరెక్టర్ గంటా స్వరూపరాణి ఇవాళ ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధి, పర్యాటక ప్రాంతాల ప్రోత్సాహం, తదితర అంశాలపై స్వల్పంగా చర్చించినట్లు సమాచారం. పవన్‌కి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.