SS: పుట్టపర్తి ప్రశాంతి గ్రామంలోని ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం కారణంగా లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందన్నారు.