PLD: నరసరావుపేటలో ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. లీటర్ పెట్రోల్, డీజిల్‌లపై రూ.2.84 చొప్పున పెరగడంతో.. పెట్రోల్ ధర రూ.117.70కి, డీజిల్ ధర రూ.105.36కి చేరింది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ధరలు పెరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. గత పది రోజుల్లోనే పెట్రోల్‌పై రూ.5.39, డీజిల్‌పై రూ.5.32 మేర అదనపు భారం పడటంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.