కడప జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం ముమ్మరంగా వాహనాల తనిఖీని పోలీసులు చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని 166 మందిపై కేసులు నమోదు చేశామని ఎస్పీ నచికేత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి రూ 37,675ల జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని లేకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.