NDL: జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం జిల్లాలో పలుచోట్ల సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దొర్నిపాడులో అత్యధికంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాణ్యంలో 39.2, శ్రీశైలంలో 39.1 డిగ్రీలు నమోదయ్యాయి. ఆళ్లగడ్డ, చాగలమర్రి, ఆత్మకూరులో 38.6 డిగ్రీలు నమోదు కాగా, రుద్రవరంలో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.